calender_icon.png 4 August, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక అంశాలను పూర్తిగా పరిష్కరించాలి

03-08-2025 09:43:34 PM

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి

భద్రాచలం,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల పదవీ విరమణ అనంతరం వారు పొందవలసిన ఆర్థిక బెనిఫిట్స్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, అట్టి జాప్యం ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఒడిదోడుకులకు కారణమవుతోందని ఇలాంటి జాప్యం సరికాదని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం మండలం ఏహెచ్ఎస్ గౌరవరం ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న టిఎస్ యుటిఎఫ్ పూర్వ కార్యదర్శి ఇర్ప  అనసూయ పదవీ విరమణ అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ప్రసంగించారు.

2024 మార్చి నుండి పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ అనంతరం చెల్లిం చాల్సిన ఆర్థిక బెనిఫిట్స్ మరియు ఉద్యోగులు పొదుపు చేసుకున్న జిపిఎఫ్, టీఎస్ జిఎల్సి  డబ్బులు చెల్లించుటలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్నదన్నారు. ఇప్పటికైనా ఇటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కారించాలని బకాయి పడ్డ డిఏ లను వెంటనే ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్రంలో జూలై 2023 నుండి అమలు చేయవలసిన రెండవ పిఆర్సీ ని తక్షణమే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఇటీవల గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ అమలు పరుస్తూ వారి ప్రాన్ ఖాతాల్లోని పొదుపు మొత్తాన్ని జిపిఎఫ్ కు సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో పండిత్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో పోస్టులను మంజూరు చేయాలని, గురుకులాల్లో అశాస్త్రీయంగా ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులను తీవ్ర మానసిక వత్తిడికి గురిచేస్తున్న గురుకులాల పని వేళలను శాస్త్రీయంగా మార్చాలని కేర్ టేకర్లు హాస్టల్ వార్డెన్లను నియమించాలని చిన్న చిన్న పొరబాట్లకు గురుకుల ఉపాధ్యాయులకు తీవ్ర దండనలకు గురిచేయడం సరికాదని అన్నారు.

కెజిబివి,యుఆర్ఎస్ ఉపాధ్యాయినులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింప జేస్తూ వారిని రెగ్యులరైజ్ చేయాలని, సమ్మెకాలపు వేతనాలను తక్షణమే చెల్లిం చాలని అదనపు బారంగా ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యతల నుండి కెజిబివి ఎస్వో లను తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనసూయ సామాజిక స్పృహ గల కార్యకర్త, అనేక సంఘ ఉద్యమ కార్యక్రమాలల్లో పాల్గొన్నారని, అవినీతిపై హాస్టల్ వ్యవస్థలో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆదివాసీ జాతి కోసం సమస్యల పరిష్కార పోరాటాల్లో పాల్గొనాలని చూపించారు.