03-08-2025 09:09:22 PM
ఎస్సై ఇనిగాలవెంకటేష్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలో ఆదివారం రోజు వాహనాల తనిఖీలను కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ ముమ్మరంగా నిర్వహించారు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు రోజు సందర్భంగా కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజన్నపేటలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే లక్ష్యంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే అనుమానితులపైనా పోలీసులు నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ అన్నారు అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.