03-08-2025 09:25:40 PM
పచ్చిపాల రామకృష్ణ యాదవ్
మునగాల,(విజయక్రాంతి): వికలాంగులకు దివ్యాంగులకు పింఛను పెంచాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం పింఛనులు పెంచాలి. ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోక పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వారి పట్ల కనికరం చూపించాలని దివ్యాంగులు వికలాంగులకు పింఛన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.