03-08-2025 09:31:00 PM
మహిళా కాంగ్రెస్ నాయకురాలును కోల్పోవడం చాలా బాధాకరం
షబ్బీర్ అలీ ఆవేదన
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు హనుమండ్ల రాజు భార్య అనారోగ్యంతో గత సంవత్సరం నుండి హైదరాబాదులో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం హనుమండ్ల రాజు ఇంటికి వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. గత ఐదు సంవత్సరాల క్రితం వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడి పోయారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి మహిళా నాయకురాలు ను కోల్పోవడం జరిగిందని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజు కుటుంబానికి, ఆయన కుమారునికి అండగా ఉంటానని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.