calender_icon.png 3 August, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

03-08-2025 09:14:03 PM

మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండలంలో ప్రాణ స్నేహితులతో ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన జబ్బోనిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది స్నేహితులు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో స్నేహితులతో కలిసి గౌరారం రాళ్ల గుండ్ల వాగు జబ్బోనిగూడెం గ్రామ శివారు వాగులో ఈత కొట్టడానికి బుచ్చంపేట గ్రామానికి చెందిన బూర్గుల అభిషేక్(22) తండ్రి రమేష్, వెళ్ళి వాగులోని రాళ్లలో ఇరుక్కొని ప్రమాదవశత్తు మృతి చెందాడు. అభిషేక్ చదువు ఆపి కూలిపని చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ బ్రతుకుని కొనసాగిస్తున్నాడు కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.