calender_icon.png 3 August, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు

03-08-2025 07:18:58 PM

కేక్ కట్ చేసి  సందడి చేసిన వ్యాపారులు

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సృష్టిలో రక్తసంబంధం లేకుండా మన కోసం ఆలోచించే బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహితుడు మాత్రమే అని చెప్పవచ్చు. అలాంటి స్నేహితుల దినోత్సవాన్ని వ్యాపారులందరు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి నిర్వహించడంతో కార్యక్రమం మరింత అందంగా మారింది.

ఈ సందర్భంగా మహాసభ మండల, పట్టణ అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ... స్నేహం ఒక విశిష్టమైన బంధం దీనికి ధనిక, పేద అనే తేడా ఉండదు అన్నారు. కుల, మత భేదాలను పట్టించుకోదన్నారు. బంధుత్వాన్ని మించినది  స్నేహబంధం అని పేర్కొన్నారు. అలాగే ఒకరినొకరు కరచలనం చేసుకుంటూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు. అనంతరం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఎస్‌హెచ్‌ఓ గా బాధ్యతలు స్వీకరించిన తాటిపాముల సురేష్ ను ఆర్యవైశ్య మహాసభ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే పూల మొక్కను బహుమతిగా అందించి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.