calender_icon.png 3 August, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలానుగుణంగా వైద్యరంగంలో మార్పులు-

03-08-2025 12:00:00 AM

- అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి

- ఆస్పత్రిలో ఈఎన్‌టీ, స్కల్ బేస్ కాన్ఫరెన్స్ సదస్సు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కాలనుగుణంగా వస్తున్న ఆరోగ్య సమస్యలు, సవాళ్లకు అనుగుణంగా వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. ఈఎన్‌టి విభాగాధిపతి డాక్టర్ ఈసి వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ 360 ఈ. ఎన్‌టి, స్కల్ బేస్ కాన్ఫరెన్స్‌ను శనివారం అపోలో ఆసుపత్రిలో ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సదస్సులో దేశంలోని  మొట్టమొదటి ఏఆర్ ఆధారిత స్కల్ బేస్ క్యాడావర్ కోర్స్ నిర్వాయించడం శస్త్రచికిత్సా శిక్షణలో మైలురాయిగా నిలిచింది అని తెలిపారు.  ఇది ఈ. ఎన్. టి రంగానికే ప్రత్యేకంగా, అత్యంత సాంకేతికతతో కూడిన అకడమిక్ ప్లాట్‌ఫామ్ అని స్కల్ బేస్ శస్త్రచికిత్సలలో ఖచ్చితత్వాన్ని, భద్రతను మెరుగుపరచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది అని అన్నారు.

సదస్సులో మలేషియాకు చెందిన ప్రఖ్యాత ఈఎన్‌టి, స్కల్ బేస్ సర్జన్ డాక్టర్ ప్రెపగేరన్ నారాయణన్, చెన్ను ఎంజీఎం హాస్పిటల్ ఈఎన్‌టి విభాగాధిపతి డాక్టర్ సంజీవ్ మోహంతీ నిపుణులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్ష ప్యానెల్ చర్చలు, ప్రసంగాలు, క్యాడావర్ ఆధారిత శిక్షణల ద్వారా హాజరైనవారికి ఒక ప్రాక్టికల్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవం లభిస్తుందని  కాన్ఫరెన్స్ నిర్వహణాధ్యక్షుడు, అపోలో హాస్పిటల్స్ ఈఎన్‌టి, స్కల్ బేస్ సర్జన్ డాక్టర్ వేమూరు తేజస్వి తెలిపారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయంగా 250కి పైగా ఈఎన్‌టి నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.