02-08-2025 11:55:05 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని,10 వార్డ్ లో నాలుగో వార్డు పరిధిలోనీ దేవునిపల్లి గ్రామంలో 83వ వారంలోకి అడుగుపెట్టిన హనుమాన్ చాలీసా పారాయణం, భక్తిశ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న దేవునిపల్లి గ్రామం, ఎల్లారెడ్డి పట్టణానికి అద్దం పట్టేలా, నాలుగో వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో కొనసాగుతున్న హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం ఇప్పుడు 83వ వారంలోకి అడుగుపెట్టింది. గ్రామస్తుల విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో ఈ ఆధ్యాత్మిక యజ్ఞం పదే పదే హనుమంతుని మహిమను ప్రపంచానికి చాటుతోంది.
ఈ భక్తిసంస్కృతిని మరింత విస్తృతంగా పంచేందుకు, శ్రావణ మాసం శుభపర్వదినాన్ని పురస్కరించుకుని, జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 7:30 గంటలకు, దేవునిపల్లి హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేకంగా ప్రతిరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహించబడుతుందనీ దేవునిపల్లి హనుమాన్ భక్త బృందం తెలియజేశారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం ఓ వెలుగు రేకెగా నిలుస్తోంది. హనుమంతుని నామస్మరణతో గాలిలో మారిన శక్తిప్రమాణం, భక్తులకు ఆధ్యాత్మిక నిండుదనాన్ని ప్రసాదిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్తులు ఇందులో పాల్గొంటూ హిందుత్వం పట్ల తమ భక్తినిబద్ధతను ప్రకటిస్తున్నారు. హనుమంతుడి చరిత్ర కాదు... శక్తి..! చాలీసా పారాయణం భక్తి కాదు... సాధన..! అనే భావంతో ఈ సామూహిక పారాయణం నిత్యం ధ్యాననాదంగా మారుతోంది. చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ హనుమాన్ భక్తులు ఆహ్వానితులే అని ఈ శ్రద్ధాన్విత కార్యక్రమంలో పాల్గొని ధార్మికతను బలోపేతం చేయండిలో పాల్గొనీ అని దేవునిపల్లి భక్త బృందం పిలుపునిచ్చారు.