01-01-2026 01:35:09 AM
ఘనంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుక
సికింద్రాబాద్ డిసెంబర్ 31 (విజయ్‌క్రాంతి) : 2026 లో తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్లు పెరిగితే బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ముద్దం నరసింహ యాదవ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా చేసే బాధ్యత తీసుకుంటానని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ ము ద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పూలబొకే అందజేసి,శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కార్పొరేటర్‌గా ప్రతిని త్యం ప్రజలలో ఉంటూ సేవ చేస్తున్న ముద్ధం నరసింహ యాదవ్ భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.
తన పుట్టినరోజు సంద ర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నా రు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి,పండాల సతీష్ గౌడ్,పగడాల శిరీష బాబురావు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి,తూముకుంట మాజీ చైర్మన్ రాజేశ్వరరావు,ఆశ వర్కర్స్,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.