27-11-2025 09:41:35 PM
విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్..
కిక్కిరిసిన భక్తజనం
పాపన్నపేట (విజయక్రాంతి): దైవ నామస్మరణ వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని, తద్వారా మనస్సు, బుద్ధి, శుద్ధి చెందుతాయని, ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్త లింగాయపల్లి పాఠశాల ప్రాంగణంలో శ్రీరామ నామస్మరణ, గురు వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి దుబ్బాక నుంచి శ్రీశ్రీశ్రీ సద్గురు సమర్థ మహారాజ్ విచ్చేసి భక్తులకు ప్రవచనాలు చేశారు. సమర్థ మహారాజ్ మొదటిసారిగా మండలానికి రావడంతో ఆయా గ్రామాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్త లింగాయపల్లి గ్రామం నుంచి చీకోడు గ్రామం వరకు భక్తులు ఇరువైపులా నిలబడి స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామ నామస్మరణ, గురు వందనం కార్యక్రమం నిర్వహించారు.