calender_icon.png 28 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలలం మేము బాలలం పాట ఆవిష్కరణ..

27-11-2025 09:43:14 PM

బెజ్జంకి: విద్యతో పాటు వినూత్నమైన అంశాలతో విద్యార్థుల ఎదుగుదలకు పాటుపడాలని మండల విద్యాధికారి మహతీలక్ష్మీ అన్నారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో గుండారం విద్యార్థులు బాలల దినోత్సవం సందర్బంగా తీసిన బాలలం మేం బాలలం ఆడియో వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మహతీలక్ష్మీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు బాలల కోసం ఎంత చేసిన తక్కువే అనిపిస్తుందని అందుకొరకు పాటుపడుతున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని అన్నారు.

చిన్నారులు చేసిన నృత్యం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో పాట రచయిత ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ కల్మషం లేని బాలల కోసం మరిన్ని రచనలు చేస్తానన్నారు.  ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి, శ్రీనివాస్, రామంచ రవీందర్, చౌడరం తిరుపతి, రాజేందర్ ,తిరుమలేశ్, సంధ్యారాణి, అనిత, శిరీష,హరీష,శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.