calender_icon.png 27 November, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మగౌని నివాసంలో మహా పడిపూజ

27-11-2025 09:38:20 PM

ముఖ్యతిథులుగా బాల్ రెడ్డి, మాణిక్ యాదవ్..

జిన్నారం: సంగారెడ్డి జిల్లా, జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో లక్ష్మాగౌని మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ వందలాద స్వామిలు, భక్తులు నడుమ కన్నుల పండుగ నిర్వహించారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమానికి జిన్నారం మండల్ మాజీ జడ్పిటిసి కొల్లాన్ బాల్ రెడ్డి, యువ నాయకులు మాణిక్ యాదవ్, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ... అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మగౌని కుటుంబ సభ్యులు లక్ష్మీ నారాయణ గౌడ్, రామచంద్ర గౌడ్, అర్జున్ గౌడ్, నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, అజయ్ గౌడ్, సంపత్ గౌడ్ గురు స్వాములు నాగేందర్ గౌడ్, అనిల్, మల్లేష్, భజన మండలి నర్సింగరావు నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.