23-01-2026 01:03:33 AM
కరింనగర్,జగిత్యాల, జిల్లాల నుండి తాకిడి
కరీంనగర్, జనవరి22(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ లో టికెట్ల పంచాయతీ మొదలయింది. మున్సిపల్ ఎన్నికల్లో జెండా పాతాలని చూస్తున్న అధికారపార్టీ కి నేతల సమన్వయ లోపం తలనొప్పిగా మారింది. కాంగ్రెస్లో సీనియర్ నేతలను చులకన చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎ మ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయ దం ద్వారా జగిత్యాల లో మరో మారు విభేదాలు రచ్చకెక్కాయి.
బీఆర్‌ఎస్ నుంచి ఎన్ని కై కాంగ్రెస్లోకి ఫిరాయించిన జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్కుమార్ పార్టీ సమావేశంలో పాల్గొన డంపై జీవన్ భగ్గుమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పార్టీ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డా రు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వచ్చి తమ పక్కన కూర్చుంటే ఎలా? అని ప్రశ్నించారు. సంజయ్ని వేదికపై కూర్చోబెట్టడాన్ని నిరసిస్తూ జీవన్రెడ్డి గాంధీభవన్ నుంచి వాకౌట్ చేశారు.
ఆయా జిల్లాలో పార్టీ నేతలనుగాడిన పెట్టేందుకు పార్లమెంటుకు ఒక ఇంచార్జి ని నియమించారు.కరీంనగర్ పార్లమెంటు కు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు , పెద్దపల్లి కి జూపల్లి కృష్ణా రావు, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లను నియమించారు. .గాంధీ భవన్ లో ఉత్తమ్ ఎదుటే జీవన్ వా కౌట్ చేయడంతో పరిస్థిని ఎలా గాడిన పెడతారో చూడాలి. ఇది ఇలా ఉంటే
తమ్మల నాగేశ్వర్ రావు బుధవారం సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి పార్టీ నేతలతో సనవేశమైన సందర్భంలో కరింనగర్ నేతలు ఒకరికి ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఇద్దరు మంత్రులు సీరియస్ అయ్యారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ నాలుగు వరుస పరాజయాలను చవిచూసింది. జిల్లా రాజకీయాలకు గుండెకాయ లాంటి కరీంనగర్ లో పూర్వవైభవాన్ని తిరిగి సాధించాలని కార్యకర్తల్లో ఉన్నా
నేతల మధ్య పంచాయతీ తలనొప్పిగా మారింది. ఇక్కడి నుండే తుమ్మలకు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. పార్టీకి చెంది న ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలకు ఎవరి వద్దకు వెళితే ఎవరికి కోపం వస్తుందో అనే పరిస్థితి ఉంది దీనితో ఇంచార్జి మంత్రి పై ఆశలు పెంచుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు కలసి పనిచేయకపోవడం తో ఇంచార్జి తుమ్మల వద్ద గోడు వెళ్లబుచ్చుకుంటున్నా రు.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారం నాలుగు స్తంభాల ఆటగా మారడం తో చక్కదిద్దే బాధ్యత ను అధిష్టానం తుమ్మ ల పై వేసింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిది లోని జగిత్యాల మున్సిపాలిటీ ఆశావాహుల్లో పెద్దల పంచాయతీ తలనొప్పిగా మారింది. పార్టీ ఇంచార్జి అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి చక్కదిద్దే బాధ్యత అప్పగించారు.
అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టికెట్లు ఇచ్చేది, ఆ తర్వాత గెలిపించేది తామే అంటుడటం తో ఇక్కడ టికెట్ల పంచాయతి తారా స్థాయికి చేరుకుంది. కరీంనగర్, జగిత్యాల లో పరిస్థితులను చక్కబెట్టేందుకు అధిష్ఠానం ఒక కమిటీని వేసి దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి అభ్యర్థులను నిర్ణయించాలని చూస్తుం ది.
నేతల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతోకరీంనగర్, జగిత్యాల మున్సిపాలిటీల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు గంద రగోళంలో పడిపోయారు. ఏ నాయకుడిని కలిస్తే టికెట్ వస్తుందో అన్న విషయంలో ఒక నిర్దారణకు రాని ఆశావహులు ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తున్నారు.
ఇంచార్జి మంత్రులు కాంగ్రెస్ను ఏ దిశగా తీసుకువెళ్తారో చూడాలి. నేతలను సమన్వయంతో పని చేయించి అభ్యర్థులను గెలిపించమని పార్టీ ఆదేశిస్తే తప్ప కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సాధించాలనుకోవడం సాధ్యం కాదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు.