calender_icon.png 3 August, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమోదైన కేసుల్లో చార్జిషీటు దాఖలు చేయాలి

03-08-2025 12:54:22 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో కొత్తగా నమోదైన కేసుల్లో త్వరితగతన చార్జర్ షీట్ దాఖలు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్టీలు వసంత్ పోలీస్ అధికారులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా  పోలీస్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  ప్రధాన న్యాయమూర్తి  మాట్లాడుతూ  జైలులో ఉన్న ముద్దాయిల కేసులను దశలవారీగా , రోజువారిగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి అంతిమ తీర్పులకు సహకరించాలని,  వారెంట్లు ఉన్న పెండింగ్ కేసులు వెంట వెంటనే అమలు పరచాలని  తెలిపారు. పాత పెండింగ్ కేసులలో సాక్ష్యాలను తీసుకొని రావాలని, నూతనంగా  నమోదైన కేసులలో వెంటనే ఛార్జ్ షీట్స్ దాఖలు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, ,ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే. కిరణ్ కుమార్ , జిల్లా లీగల్ సర్వీసెస్  అథారిటీ సెక్రెటరీ ఏం. రాజేందర్ ,అదనపు సీనియర్ సివిల్ జడ్జి కర్నాటి కవిత, రెండవ అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవి కుమార్ సుపరీoటెండెంట్ ఆఫ్ పోలీస్ బిరుదు రాజు రోహిత్ రాజు , ఏ.ఎస్పీ .విక్రమ్ కుమార్ సింగ్,  పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏ పి పి లు,జిల్లాలోని డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ,సబ్ ఇన్స్పెక్టర్లు ఫారెస్ట్ అధికారులు ,ఎక్సైజ్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, కోర్టు నోడల్ ఆఫీసర్,  కోర్టు లైజాన్ ఆఫీసర్లు,పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.