calender_icon.png 3 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర పాలసీతోనే చెరువులు, కుంటల అభివృద్ధి

03-08-2025 12:53:10 AM

  1. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ

చెరువులు, కుంటల పరిరక్షణ, గ్రౌండ్ వాటర్ పెంపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చ

రైతు కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు

హాజరుకావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ర్టంలో చెరువులను కాపాడుకోవటానికి సమగ్రమైన పాలసీ ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతు కమిషన్ తెలిపింది. ఆ పాలసీని కమిషన్ తయారు చేయనున్నట్టు వివరించింది. శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రైతు కమిషన్ భేటీ అయింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి పాల్గొన్నారు.

ఇప్పటివరకు రైతు కమిషన్ చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ర్టంలో చెరువులు, కుంటల పరిరక్షణకు రాష్ర్ట ప్రభు త్వం చేపట్టాల్సిన చర్యలపై మంత్రికి కమిషన్ సూచనలు చేసింది. మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నీటి సంఘాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.

గ్రామీణ స్థాయిలో రైతులు సంఘటితమై చెరువులను కాపాడుకునే వారని, అయితే గత పదేళ్ల కాలంలో రాష్ర్టం లో ఉన్న చెరువులు కుంట లు అన్యాక్రాంతమయ్యాయని వివరించింది. కొన్ని చోట్ల కబ్జాదారులు ఆక్రమించి లే ఔట్లు వేయడం, వాటర్ బాడీస్‌కు వచ్చే క్యా చ్‌మెంట్ ఏరియాల్లో భారీగా కాల్వలు దెబ్బతినడం జరిగాయని తెలిపింది.

నిపుణులతో పాలసీకి సంబంధించి ప్రజెంటేషన్ మీటింగ్‌ను త్వరలో కమిషన్ ఏర్పా టు చేయను న్నదని, ఆ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకావాలని కమిషన్ కోరింది. కమిషన్ ఆహ్వానానికి మంత్రి ఉత్త మ్ సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.