03-08-2025 12:55:30 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాం తి): ఢిల్లీ యాత్రల్లో రేవంత్ రెడ్డి హాఫ్ సెం చరీ పూర్తి చేశారని, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ వల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫైల్స్‌తో కాకుండా ఫ్లుటై బుకింగ్స్‌తో రాష్ట్రాన్ని పాలిస్తూ టూరిస్ట్ సీఎంగా దేశ చరిత్రలో నిలిచిపోతారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎద్దేవా చేశారు.
రేవంత్ సీఎం అయినప్పటి నుంచి ఫ్లుటై టికెట్లు బుక్ చేసుకోవడం, ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేయడం, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూ రావడం అనే మూడు పనులను పట్టుదలతో చేస్తున్నారని పేర్కొన్నారు. పాలించే సీఎం కావాలి కానీ, ఢిల్లీకి విహారయాత్రలు చేసే టూరిస్ట్ సీఎం అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. ముగ్గురు యజమానుల ముద్దుల బానిస అయిన రేవంత్, రాహుల్ గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
మోదీకి సన్నిహి తులైన వ్యాపారవేత్తలకు తెలంగాణను తాకట్టుపెట్టి కేసుల నుంచి తప్పించు కుంటున్నారని కేటీఆర్ వాపోయారు. మన అన్నదాతల కడుపుకొట్టి, తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచిపెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణపై సోయిలేని రేవంత్‌రెడ్డి, బానిస మనస్తత్వంతో త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ నిలువు దోపిడి అవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి సాధించింది ఏమిటో దమ్ముంటే రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే బనకచర్లతో మన వ్యవసాయరంగం పెను సంక్షోభంలో కూరుకుపోతుందని తెలంగాణ తల్లడిల్లుతుంటే రేవంత్ మాత్రం గురువు చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవటంతో సాగునీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేక, పొలాల్లో చల్లడానికి యూరియా దొరకక అన్నదాతలు అరిగోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.