01-09-2025 02:15:49 PM
ఓ పక్క గోదావరి మరోపక్క భారీ వర్షంతో రాకపోకలు బంద్..
చర్ల (విజయక్రాంతి): మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ముంపు ప్రాంతంను తలపిస్తున్న మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లోని అన్నపూర్ణ హోటల్ ను వరద నీరు ముంచేసింది. ప్రధాన కూడాలన్నీ జలదిగ్బంధం అయ్యాయి. ప్రధానంగా బస్టాండ్ ప్రాంగణం మొత్తం జలమయమైంది, ప్రధాన రహదారి వెంట వరద నీరు ఏరులై ఆడుతుంది, చర్ల మండల వ్యాప్తంగా భారీగా వర్షపు వరద నీరు చేరడంతో చెరువులు నిండుకున్నాయి, కాలువలు పొంగి పొందుతున్నాయి. అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, భారీ వర్షం.. రెండో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి వరదతో చర్ల మండలంలో పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. చర్ల నుండి భద్రాచలం, వెంకటాపురం వెళ్లేందుకు వాహనాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.