calender_icon.png 1 September, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత సంచలన ఆరోపణలు..

01-09-2025 05:05:58 PM

హైదరాబాద్: హరీష్ రావు పాత్ర ఉన్నందునే రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పించారని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో హరీష్ రావు, సంతోష్ కుమ్మక్కు అయ్యారని అన్నారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా.. ఏం మాట్లాడినా నోరు మెదపలేదని తెలిపారు. ఈరోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నానని.. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని.. హరీష్ రావు, సంతోష్ ను రేవంత్ రెడ్డి ఏమి అనరని నా తండ్రిపైనే బాణం వేస్తారని కవిత చెప్పారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక తొక్కలో పార్టీ ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి.. మా తండ్రి దాకా వచ్చాక ఇంకా పార్టీ ఏంటి.. అని పేర్కొన్నారు. ఇది నా తండ్రి పరువుకు సంబంధించిందని, నా లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదని తెలిపారు. ఈ వయసులో కేసీఆర్ సీబీఐ విచారణ ఎందుకు ఎదుర్కోవాలని, నా మాటల వల్ల బీఆర్ఎస్ శ్రేణులకు కోపం రావచ్చు, అప్పుడప్పుడూ వాస్తవాలు మాట్లాడుకుని మందు తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని కవిత ఆరోపించారు.