01-09-2025 03:48:04 PM
వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు..
చివ్వెంల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2025-26 సంవత్సరానికి గాను రైతులకు వ్యవసాయ పనిముట్లు 40 నుండి 50 శాతం రాయితీపై అందిస్తున్నామని చివ్వెంల మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు(Agriculture Officer D. Venkateshwarlu) తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, చిన్న, సన్నకారు రైతులకు 50% సబ్సిడీపై ఉంటుందని, ఇతర సామాజిక వర్గాల పెద్ద రైతులకు 40% రాయితీపై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న పరికరాలు చేతితో/బ్యాటరీతో నడిచే మందు కొట్టే పంపులు, పవర్/తైవాన్ స్ప్రేయర్లు, రోటవేటర్లు, సీడ్ ఫర్టిలైజర్ డ్రిల్, పవర్ విడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, మొక్కజొన్న పొట్టు తీసె యంత్రం, గడ్డి కట్టలు కట్టే యంత్రం, ట్రాక్టర్ తో దున్నే పనిముట్లు(నాగలి, డిస్క్ హీరో, దమ్ము చక్రాలు) పొలం గట్టు చెక్కే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావలసిన రైతులు సెప్టెంబరు ఆరో తారీకు వరకు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు: దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, భూమి పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ట్రాక్టర్ పనిముట్లు కోసం అయితే ట్రాక్టర్ ఆర్ సి జిరాక్స్ లతో వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.