01-09-2025 03:53:01 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం..
చండూరు/గట్టుపల (విజయక్రాంతి): గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. సోమవారం గట్టుపల మండల కేంద్రంలోని సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు మెమొరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలలో 70 వార్డులలో సీసీ రోడ్లు మురికి కాలువలు నూతనంగా నిర్మాణం ఏర్పాటు చేయాలని అవార్డులలో విష జ్వరాలు రాకుండా దోమల మందులు స్ప్రే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సీజనల్ విష జ్వరాలు వస్తున్న సందర్భంగా గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా గ్రామాలకు గ్రామాలకు లింకు రోడ్లు నిధులు మంజూరు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సులు అన్ని గ్రామాలు నడిపించాలని కోరారు.
గ్రామాలలో పాత బావులు పూడ్చాలని రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని మండల వ్యాప్తంగా 68 వార్డులలో నాణ్యమైన వీధిలైట్లు వేయాలని అర్హులైన ప్రజలందరికీ పింఛన్లు ప్రభుత్వం పెంచి ఇస్తాన్న పింఛన్ ఇవ్వాలని ఆయన అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలోని ప్రభుత్వం కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని అర్హులైన పేద ప్రజలకు భూమి పంచాలని ఆయన అన్నారు. అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గ్రామాలలో కృష్ణ వాటర్ రెగ్యులర్గా సరఫరా చేయాలని కరెంటు లూజ్ లైన్లు ఉన్న గ్రామంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం జిల్లా నాయకులు చాపల మారయ్య మండల కమిటీ సభ్యులుకర్నాటి సుధాకర్ అచ్చిని శ్రీనివాస్ కర్నాటి వెంకటేశం పరుసగొని యాదగిరి ఓల్లూరు శ్రీశైలం ఖమ్మం రాములు పెదగాని నరసింహ రావుల నరసింహ ఖమ్మం రాములమ్మ నాయకులు ఎండి రబ్బాని విశ్వనాథ ముసుకు బుచ్చిరెడ్డి విశ్వనాథం కట్ట యాదగిరి కర్నాటి యాదయ్య పసుపుల చెన్నయ్య రాములు దుబ్బాక శంకరయ్య బొబ్బలి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.