calender_icon.png 1 September, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు..

01-09-2025 03:45:33 PM

పరిశీలించిన సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ శ్రీనివాస్..

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas), బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్(Sub-Collector Manoj) పరిశీలించారు. ఈనెల 5వ తేదీన నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. నిమజ్జనోత్సవంలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లకు పలు సూచనలు చేశారు. భారీకేడ్లు, విద్యుత్ దీపాలు, గజ ఈతగాలను చెరువు వద్ద అందుబాటులో ఉండాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వినాయక చవితి పండుగ ముగింపు ఉత్సవం నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు. డీసీపీ శ్రీనివాసు, సబ్ కలెక్టర్ మనోజ్ వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, ఇతర అధికారులు ఉన్నారు.