01-09-2025 03:17:22 PM
జిల్లా కలెక్టర్ కు టిఎస్ జేయు వినతి..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు కుటుంబాలకు జిల్లాలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్ లలో 50 శాతం రాయితీపై వైద్య సేవలు అందించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా నాయకులు సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇలాంటి జీతభత్యాలు లేకుండా పనిచేస్తూ ప్రజా సేవకు అహర్నిశలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కరించేందుకు అలుపెరిగిన కృషి చేస్తున్నారని తెలియజేశారు.
ఈ క్రమంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతం అవుతున్నారని ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రైవేటు ఆస్పత్రుల్లో రైతు కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో టిఎస్ జేయు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తడుక సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, ఉపాధ్యక్షులు వలి, గట్టు రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి క్యాతం వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శులు కడపాక రవి, బొచ్చు భూపాల్, బొల్లెపేల్లి జగన్, మారపల్లి చంద్రమౌళి,యంసాని రాజు, ప్రచార కార్యదర్శి కారుకురి సతీష్, క్యాతం మహేందర్, తదితరుల పాల్గొన్నారు