calender_icon.png 1 September, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై మాట్లాడలేకనే కేసీఆర్ మోహం చాటేశారు..

01-09-2025 02:10:55 PM

హైదరాబాద్: కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని.. అందుకే దానిని సీబీఐకి అప్పగించామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. కాళేశ్వరంపై మాట్లాడలేకనే కేసీఆర్ మోహం చాటేశారని.. కాంగ్రెస్ చిత్తశుద్దితో బీసీ బిల్లు పోరాడుతుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేఖమని అన్నారు. శాసనమండలిలలో ఆమోదించిన మూడు బిల్లులపై కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు.

రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రులు సీతక్క, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ(BRS), సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నేతలు ఆమోదించాలని గవర్నర్ ను కోరారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌజ్ పరిగణనలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరినట్లు ఆయన వెల్లడించారు.