01-09-2025 04:33:10 PM
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి(Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 21న వరంగల్ వేయిస్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభమవుతాయని.. అలాగే సెప్టెంబర్ 29న ఎల్బీస్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే లక్ష్యంతో బతుకమ్మ వేడుకలు జరుగుతాయని తెలిపారు. బతుకమ్మ పండుగను గోప్ప కార్నివాల్ గా నిర్వహిస్తామని, పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు ఉంటుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా బతుకమ్మ వేడుకలు జరుగుతాయని తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందలు కూడా జరుపుతామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలిసేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు.