calender_icon.png 1 September, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్ల దారి ఆక్రమణను అడ్డుకోవాలి

01-09-2025 03:58:08 PM

తహసీల్దార్ కు రైతుల వినతి..

మోతె: సోమవారం బండ్ల బాటను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైతులు తహసీల్దార్ యం. వెంకన్న(Tahsildar Venkanna)కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 293, 289లో గల భూమి బండ్ల బాట మోతె నుంచి రాఘవపురం గ్రామానికి సుమారు మూడు తరాలుగా రాకపోకలు జరుగుతున్నాయని అటు వైపున ఉన్న సెలకలకు పొలాలకు రైతులు బండ్లు కట్టుకొని పశువులు తోలుకొని తమ తమ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండే వారమణి ఇటీవల జాతీయ రహదారి ఏర్పడిన తర్వాత కొందరు డబ్బు ఎక్కువగా వస్తున్నదని తమ భూములను రియల్ ఎస్టేట్ కు అమ్ముకొని మా భూములు కూడా రియల్ ఎస్టేట్ కు అమ్మాలని మాపై ఒత్తిడి తెచ్చి పోలీసు వారితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన తెలిపారు. గ్రామంలో ఈ విషయమై పెద్దలందరినీ విచారించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.