01-09-2025 03:35:16 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మాజీ మంత్రి, పీసీసీ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని సోమవారం తుంగతుర్తిలోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Former MLA Gadari Kishore Kumar) పరామర్శించి, ఆరోగ్యంపై, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, ఎన్నికల అప్పుడే రాజకీయాలని, పరిచయమైన ఎదుటి వ్యక్తిని, పేరుతో పిలిచి యోగక్షేమాలు అడిగే మనసున్న, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి దామోదర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుజ్జ యుగంధర్ రావు పులుసు యాదగిరి గౌడ్ తాటికొండ సీతయ్య గుండ గాని రాములు గౌడ్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.