calender_icon.png 2 August, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి సెంటర్, ప్రాథమిక పాఠశాల, గ్రామంలో పారిశుద్ద పనులను తనిఖీ

01-08-2025 10:10:45 PM

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా సీజనల్ డిసీసేస్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల చిన్నబోయినపల్లి ఉపకేంద్రం పరిధిలోని షాపల్లి గ్రామాన్ని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా సీజనల్ డిసీసేస్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి(Officer Dr. Vasam Venkateswar Reddy) సందర్శించి ఆ గ్రామంలో డెంగు వ్యాధి బారిన పడిన ఇంటిని సందర్శించి బాలుని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని బాలుని తండ్రితో మాట్లాడుతూ, బాలుడు రక్తహీనతతో ఉన్నాడని అతనికి పోషకాహారాన్ని ఇవ్వాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, జ్వరము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్సను తీసుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు.