calender_icon.png 2 August, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలకు సరైన పత్రాలు కలిగి ఉండాలి

01-08-2025 10:07:16 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల స్థానిక ఎస్ఐ గణేష్(SI Ganesh) శుక్రవారం ముస్తాబాద్ మండల ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ, ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లతో పాటించవలసిన నియమ నిబంధనలు తెలియజేశారు. అనగా ప్రతి ట్రాక్టర్ కి నంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, ఆర్సీ తప్పకుండ ఉండాలన్నారు. మైనర్లను డ్రైవర్లుగా పెట్టకూడదని ప్రతి డ్రైవర్ తప్పకుండ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తే చట్ట ప్రకారం కేసులు చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ మండల ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.