25-09-2025 07:58:11 PM
కరీంనగర్,(విజయక్రాంతి): మన చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా చేస్కోని... కాలుష్యాన్ని నివారిస్తూ... పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. స్వచ్చతా హీ సేవా 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో " ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్" నినాధంతో మానేరు డ్యాం పరివాక ప్రాంతంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది. కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ నరెందర్ రెడ్డి అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకిడే, కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మానేరు డ్యాం పై శ్రమదానం చేశారు.
నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, పలు ఇనిస్టిట్యూట్ ల విద్యార్థులతో కలిసి పరిసరాల్లో ఉన్న చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి... కలుపు మొక్కలను తొలగిస్తూ.. పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం స్వచ్చతా ప్రతిజ్ఞ చేసి... మంత్రి ప్రసంగిస్తూ... పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ, కాలుష్య నివారణ, పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త, వివిధ వ్యర్థల పై వివరిస్తూ... స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.... పరిసరాల శుభ్రత, ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.
కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకొవడం మన అందరి బాధ్యత అని పిలుపు నిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించి... భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలని పిలుపు నిచ్చారు. డిల్లీ లాంటి మహా నగరంలో వాతావరణ కాలుష్యం అధికమై ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి చూశామని... అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకుండ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటి పెంచే కార్యక్రమాలను చేస్తుందని అన్నారు. వాతావరణం కలుషితం కాకుండ ప్రభుత్వం వేకిహిల్స్ పొల్యూషన్ రాకుండ ఈవీ పాలసీని తెచ్చి అనేక రకాల చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల బాగస్వామ్యం ఉండాలని పిలుపు నిచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ చేపట్టిన స్వచ్చతా కార్యక్రమం అభినందనీయమని... ప్రతి ఒక్కరు బాగస్వాములై మన చుట్టు పరిసరాలను, మన ప్రాంతాలను పరిశుభ్రం చేస్కోవాలని పిలుపు నిచ్చారు. మన నిత్య జీవితంలో ఇది అంతర్బాగంగా భావించి.... నిరంతర ప్రక్రియగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కరీంనగర్ నగరాన్ని మనమందరం కలిసి స్వచ్చమైన, సుంధరమైన నగరంగా మార్చాలని పిలుపు నిచ్చారు. కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదం తో నగరపాలక సంస్థ నగర వ్యాప్తంగా స్వచ్చతా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. వారంలో ఒక రోజు ఒక ప్రాంతంలో పరిశుభ్రత పనులు చేపడుతూ... నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు.