25-09-2025 08:08:18 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈనెల 28 న కట్టంగూరు మండల కేంద్రంలో జరిగే నల్లగొండ జిల్లా శ్రామిక మహిళ సదస్సు ను జయప్రదం చేయాలని సిఐటియు కట్టంగూర్ మండల కన్వీనర్ పొడిచేటి సులోచన కోరారు. గురువారం కట్టంగూరు మండల కేంద్రంలో ఆసదస్సు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సదస్సుకు నల్గొండ జిల్లా 33 మండలాల నుండి శ్రామిక మహిళలు హాజరవుతున్నారని ఆమె తెలిపారు. అన్ని రంగాలలో పనిచేసే స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం జిల్లాలో అన్ని రంగాలలో పనిచేసే శ్రామిక మహిళలు సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడితోడం కొరకు అనేక ఉద్యమాలు రూపొందించుకోవడానికి ఈ సదస్సు నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు.