25-09-2025 07:02:03 PM
చిట్యాల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ అఫ్ చిట్యాల ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి సూర్యాపేట వారి సహకారంతో వెలిమినేడు గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని నార్కెట్ పల్లి సిఐ కె. నాగరాజు, చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా అవసరమని, గ్రామ ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు. శిబిరంలో కంటి ఆసుపత్రి విజన్ టెక్నీషియన్ దేవులపల్లి ఫణికుమార్, క్యాంప్ ఆర్గనైజర్ బాణాల వీరేందర్ చారి పర్యవేక్షణలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.
దాదాపు 250 కి పైగా గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చిట్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జనగాం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఆరోగ్య రంగంలో చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి చిట్యాల లయన్స్ క్లబ్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్, ట్రెజరర్ కొల్లొజు శ్రీకాంత్, పాటి మాధవరెడ్డి, పొన్నం లక్ష్మయ్య గౌడ్, పంతంగి కరుణాకర్ గౌడ్, కంభంపాటి సతీష్, బాలగోని రాజు గౌడ్ పాల్గొన్నారు.