30-04-2025 06:41:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి కేబినెట్ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ తెలిపారు. బీసీల రిజర్వేషన్లను పెంచాలని ఆయా రాష్ట్రాలు కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి బీసీల జనాభా జరిగినప్పటికీ రిజర్వేషన్లను అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2న ఢిల్లీలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని ధర్నా చేయడం జరిగిందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.