29-06-2025 02:35:35 AM
రంగారెడ్డి, జూన్ 28(విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: ‘నగర అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా ముందుకు సాగుతూనే ఉం టాం.. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వా త అభివృద్ధి మీదే మా దృష్టి.. ఈ అభివృద్ధి యజ్ఞం ఆగదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఒక ప్రణాళికతో అభివృద్ధి పరిచేందు కు.. తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నామని, న్యూయా ర్క్, టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చేయాలని తాము నిరంతరంగా శ్రమిస్తున్నామన్నా రు.
డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంటును విడుదల చేస్తామన్నారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలో రూ.182.72 కోట్లతో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పీజేఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హైటెక్ సిటీకి బీజం పడిందని..ఆ తర్వాత చంద్రబాబు దీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. హైటెక్ సిటీ మహారాష్ట్రకు తరలిపోకుండా పీజేఆర్ పోరాటం చేశారని, జంటనగరాల్లో 25 ఏళ్లు పీజేఆర్ శకం నడిచిందన్నారు.
ఆయన వల్లే కృష్ణా, గోదావరి జలాలు హైదరాబాద్‌కు వచ్చాయని గుర్తు చేశారు. ‘పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్ లాగా ఉండేది.. హైదరాబాద్‌కు వలస వచ్చి న వారిపై దౌర్జన్యాలు జరిగితే పీజేఆర్ అండ గా ఉన్నారు. పీజేఆర్ విగ్రహం ఏర్పాటు కోసం సరైన స్థలాన్ని గుర్తించాలి.. పేదలకు అండగా నిలిచిన పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషం.’ అని సీఎం చెప్పారు. 3లేయర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నామని, రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధ మవుతాయన్నారు.
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంలా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డీజిల్ బస్సుల వల్ల హైదరాబాద్‌లో కాలుష్యం పెరుగుతుందని వాటి ని జిల్లాలకు తరలిస్తున్నామన్నారు. నగరం లో 3వేల ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. రాబోయే వంద ఏళ్లకు సరిపోయేలా నగర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, రోడ్లు వెడ ల్పు, అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించబోతున్నామన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో కంపెనీలు
ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని, కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌పై ఒత్తడి పెరుగుతున్నదనే 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని చేపట్టామన్నారు.
తెలంగాణపై కేంద్రానికి ఎందుకు వివక్ష..
దివంగత ప్రధాని మన్మోహన్‌సింగ్, కేం ద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కృషి వల్ల హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందని, పీవీ వల్ల ఐటీ వచ్చిందని, ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్‌కు ఏమి వచ్చిందో కేంద్రమంత్రి కిష న్‌రెడ్డి తెలుపాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘బెంగళూరు, చెన్నైకి, ఏపీకి మెట్రో రైల్ ఇచ్చారు.. గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు.. గుజరాత్‌కు సబర్మతి, ఢిల్లీకి యమునా, ఉత్తరప్రదే శ్‌కు గంగా ఇచ్చారు.. మరి మన మూసీ రివర్ ఫ్రంట్‌కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగా ణ అభివృద్ధిలో బేషజాలు లేవు మీ వెంటే వస్తామని స్వయంగా కిషన్‌రెడ్డి ఇంటికి వెళ్లి అడిగానని సీఎం చెప్పారు. నగరానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షా ను కలిసి మెట్రోకు, మూసీ, ట్రిపుల్ ఆర్‌కు అనుమతులు ఇవ్వాలని కోరుతామన్నారు. మెట్రోలో తెలంగాణ కు 9వ స్థానానికి దిగజారింది కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా అని సీఎం చురకలు అంటిం చారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని.. తెలంగాణపై కేంద్రానికి వివక్ష ఎందుకో కేం ద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని డిమాండ్ చేశారు.
హైడ్రా ద్వారా ఆక్రమణలకు చెక్..
ఆక్రమణ గురైన స్థలాలను గుర్తించి హైడ్రా ద్వారా తొలగింపులు చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరా బాద్‌లో నాలాలు, చెరువుల కబ్జాలకు విముక్తి కల్పిస్తున్నట్లు చెప్పారు. హైడ్రా ద్వారా చెరువులను రక్షిస్తున్నామని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చామని, ఆ తర్వాత ఆయనే స్వయం గా కలిసి తాను హైదరాబాద్‌కు చేస్తున్న అభివృద్ధి గురించి అభినందించి చెరువు కు అనుకొని ఉన్న రెండు ఎకరాల భూమి ని ప్రభుత్వాన్ని అప్పగించి నిజమైన హీరో గా నిలిచారని ప్రశంసలు కురిపించారు.
అంబర్‌పేటలో బతుకమ్మకుంట పరిరక్షణ కోసం సీనియర్ లీడర్ హనుమంతరావు 40 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారని, హైకోర్టులో తాము కొట్లాడి బీఆర్‌ఎస్ నాయకులు ఆక్రమించుకున్న ఆరు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామ న్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయకుండా కొందరు కోర్టులో కేసు లు వేస్తూ కాళ్లకు బంధనాలు వేస్తున్నారని విమర్శించారు.
శేరిలింగంపల్లి నాలుగు నియోజకవర్గాలు..
2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగబోతోందని, శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ప్రాం తమంతా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అందరికీ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం వస్తుందని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీని వాడుకొని పనిగట్టుకుని కంచ గచ్చిబౌలి భూముల అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క ఏనుగు లేకపోగా, ఏనుగులన్నీ వెళ్ళిపోతున్నాయని వాట్సాప్ లో షేర్ చేశారని ఎద్దేవా చేశారు.
వైజాగ్‌లో జింకలు చనిపోతే ఫొటోషాప్‌లో ఎడిట్ చేసి ఇక్కడే చనిపోయా యని ప్రచారం చేశారన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.