05-05-2025 12:58:12 AM
న్యూఢిల్లీ, మే 4: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం లో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ చర్యలు ముమ్మరం చేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ ఇప్పటికే పాక్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు సింధు దాని ఉపనదుల నీటిని భారత్ ఆపదులే అని భావించిన పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది.
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో గల చినాబ్ నదిపై ఉన్న బాగ్‌లిహార్ ఆనకట్ట నుంచి దిగువకు నీరు వెళ్లకుండా అధికారులు ఆదివారం నిలిపివేశారు. జీలంపై ఉన్న కిషన్‌గంగ ఆనకట్ట నుంచి కూడా ఇదే విధంగా నీటి విడుదలను నిలిపివేయాలని అధికారులు యోచిస్తున్న ట్టు సమాచారం.
900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం భారత్ ఈ డ్యామ్‌ను 2008లో చినాబ్ నదిపై నిర్మించింది. ఇప్పు డు ఈ ఆనకట్ట గేట్లను మూసివేయడం ద్వారా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న పంట పొలాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
పాక్‌కు పెద్ద దెబ్బే..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960 లో ఇండియా నడుమ సింధు జలాల ఒప్పందం జరిగింది. ఇండియా దేశాల మధ్య సింధు దాని ఉపనదుల నీటి విభజన కోసం ఈ ఒప్పందం కుదిరిం ది. ఈ ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్‌కు నియంత్రాణాధికారం ఉండనుంది. సింధు, చీనాబ్, జీలం నదులపై పాక్‌కు అధికారాలు లభించాయి. ఈ నదుల ద్వారా ఏడాదికి 99 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లు పారుతాయి.
ఈ నదు ల్లో లభించే నీళ్లలో భారత్‌కు 30 శాతం, పాక్‌కు 70 శాతం అధికారాలు ఉన్నాయి. ఈ నదుల్లోని నీటిని భారత్ వ్యవసాయం కోసం పరిమితంగా మాత్రమే వినియోగించుకోవాలి. జల విద్యుత్ ఉత్పత్తి, చేపల పెం పకం, రవాణా కొరకు అపరిమితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం భారత్ చినా బ్ నదిపై ఉన్న బాగ్‌లిహార్ ఆనకట్టను మూసివేయడంతో పాక్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది.