calender_icon.png 5 May, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానితో ఎయిర్ చీఫ్ భేటీ

05-05-2025 01:01:58 AM

మోదీ నివాసంలో సమావేశం

  1. ఇప్పటికే మోదీతో భేటీ అయిన నౌకాదళాధిపతి 
  2. భారత నౌకలకు ప్రవేశం నిలిపివేసిన పాక్
  3. పదోరోజు సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగిన పాక్

న్యూఢిల్లీ, మే 4: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత త్రివిధ దళాలకు ప్రధాని నరేంద్రమోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చిన విష యం తెలిసిందే. ఆదివారం ప్రధాని నివాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ మోదీతో సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నౌకాదళాధి పతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులు ఒక్కొక్కరితో సమావేశం అవుతున్నారు. 

భారత నౌకలకు ప్రవేశం నిలిపివేత

పాకిస్థాన్ మరోమారు భారత చర్యలను కాపీ కొట్టింది. పాకిస్థాన్ జెండా ఉన్న నౌకలపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత పాక్ కూడా అచ్చం అటువంటి ఉత్తర్వులనే వెలువరించింది. అంతే కాకుండా భారత్ నుంచి వస్తువుల దిగుమతిని కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే భారత నౌకలు పాక్‌కు వెళ్లేందు కు వీల్లేదని మన అధికారులే ఆదేశాలు జారీ చేసిన తర్వాత పాక్ నిషేధం విధించి ఏం లాభమనే చర్చ జరుగుతోంది.

మరోవైపు పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా పదో రోజు కూడా సరిహద్దు ల వద్ద కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడు స్తూ కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భార త సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.