calender_icon.png 13 August, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంచార్జ్ కలెక్టర్ పర్యటన

13-08-2025 04:14:02 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని వివిధ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో బుధవారం పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని మరిపెడ, పెద్ద చెరువు, మహబూబాబాద్ నిజాం చెరువు, బంధంచెరువు, మున్సిపల్ పరిధిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

పురుషోత్తమాయగూడెం వంతెన వద్ద గత సంవత్సరం జరిగిన వరదలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ వరద నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.