calender_icon.png 13 August, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’

13-08-2025 03:57:37 PM

100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

మహబూబాబాద్,(విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బుధవారం 100 అడుగుల జాతీయ పతాకం’తో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహించారు.

భారతీయ మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’  ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని, జాతీయ జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని వక్తలు పిలుపునిచ్చారు.