calender_icon.png 13 August, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు బట్టీ పట్టే విధానానికి స్వస్తి చెప్పాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

13-08-2025 03:52:41 PM

వనపర్తి,(విజయక్రాంతి): విద్యార్థులు బట్టీ పట్టే విధానానికి స్వస్తి చెప్పాలని, సహజ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం పానగల్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. డిఇఓతో కలిసి పాఠశాలలో గత ఏడాది పాస్ పర్సంటేజ్ ను, ఈ ఏడాది విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించిన రిపోర్టులను తెప్పించుకొని పరిశీలన చేసి ఈసారి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా సన్నద్ధం చేయాలని  సూచించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్ ను సందర్శించి అందులో వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారనే విషయాన్ని పరిశీలించారు. విద్యార్థులకు టైం టేబుల్ ఏర్పాటు చేసి దాని అనుగుణంగా శిక్షణ ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. విద్యార్థులకు సరిపడా కంప్యూటర్లు, హెడ్సెట్ లు , ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.