calender_icon.png 28 October, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

25-10-2025 06:10:34 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నవలిమిటెడ్  పాల్వంచ సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో తాటి ఆకుల కళాకృతులు విక్రయించడం ద్వారా రూ.1,35,700/-వచ్చిన నగదు జనరల్ మేనేజర్ సిఎస్ఆర్ఎం. జి.ఎం.ప్రసాద్, జనరల్ మేనేజర్ పవర్ ప్లాంట్ ఆర్.పి కిరణ్, చెక్కును మహిళలకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సిఎస్ఆర్ ఎం.జి.ఎం ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుడాలని, ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుందని పేర్కొన్నారు.