25-10-2025 06:11:00 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంలో పేదింటి బిడ్డలకు పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం ఆదుకొంటుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇల్లందు తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన ఇల్లందు మున్సిపాలిటీ, మండలం కు చెందిన 44 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ప్రతి పేద వారికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు, ఇల్లందు డిఎస్పి చంద్రభాను, ఇల్లందు టౌన్, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్, పులి సైదులు, ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాము, మాజీ మున్సిపల్ చైర్మెన్ యదలపల్లి అనసూర్య, నాయకులు మాడుగుల సాంబమూర్తి, గందె సదానందం, మండల టౌన్, ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, సుదర్శన్ కోరీ, జాఫర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉఫాధ్యక్షులు ఈసం లక్ష్మణ్, పాయం క్రిష్ణ ప్రసాద్, ప్రసన్న కుమార్ యాదవ్, తాటి భిక్షం, తాటి రాంబాబు, కల్తీ పద్మ, పాయం స్వాతి, బానోత్ శారద, పాయం లలిత, మోకాళ్ళ వెంకటమ్మ, గాలి స్వరూపా, భుక్యా రమాదేవి, మండల అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.