25-10-2025 06:08:27 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను తహశీల్దార్ రఫతుల్లా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన 38 (బీసీ (BC) 23, ఎస్సీ (SC) 6, మైనార్టీ (MINORITY) 6, ఈబీసీ (EBC) 2, ఎస్టీ (ST) 1) మంది లబ్ధిదారులకు రూ. 38,04,408 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు అందజేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.