28-10-2025 12:37:46 AM
పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, అక్టోబర్ 27 :ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా నిర్వహించుకునే ఛట్ పూజలు బొల్లారంలో సోమవారం ఘనంగా జరిగాయి. సోమవారం సాయంత్రం ఏ ర్పాటు చేసిన ఛట్ పూజకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అ నంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అందరికీ సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలో నివసించే ప్రతి ఒ క్కరూ స్థానికులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిఐ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కిషన్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.