28-10-2025 12:38:05 AM
నిర్మల్, అక్టోబర్ ౨౭ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని దానం చేయ డం ప్రాణదానంతా పుణ్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో ఎస్పీ జానకితో పాటు పోలీసులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేశారు. జిల్లాలో పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక సేవా దృక్కోణంలో ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి, రాజేష్ మీనా అవినాష్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.