18 April, 2026 | 11:03 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

26-06-2025 06:24 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) సాహు మహారాజ్ 151వ జయంతి వేడుకలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తాలో గురువారం  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చత్రపతి సాహు మహారాజ్ 1874 జూన్ 26న మహారాష్ట్రలో బోన్స్లే రాజవంశానికి చెందిన యాదవ రాజు అని, భారత రాచరిక రాష్ట్రమైన కొల్లాపూర్ మొదటి మహారాజ్ ఛత్రపతి సాహు మహారాజ్ ప్రజాస్వామ్య వాది మొదటిసారి భారతదేశంలో తన ప్రభుత్వంలో అన్ని కులాల వారికి రిజర్వేషన్ కల్పించారని ఆయన సేవలను కొనియాడారు.

బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.ఆయనను ఆదర్శం గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీలు ఐక్యంగా ఏర్పడి రాజ్యాధికారం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు రామటెంకి దుర్గారాజ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గజెల్లి లక్ష్మణ్, ఆయా  సంఘాల నాయకులు దాసరి రామన్న, ఎడ్ల శంకర్, లయోలా కుమార్, సాధుల విద్యాసాగర్, పాత వీరస్వామి అంబేద్కర్ సంఘంనాయకులు నారా లింగయ్య, ఏ సత్యనారాయణ తాళ్లపల్లి బాలరాజ్, మామిడి పాపన్న, గుడికందుల సమ్మన్న,  దొరిశెట్టి రామన్న,  ఉదయ రాజ్, నోముల దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు