calender_icon.png 18 July, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తకాలు,యూనిఫాంలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి..

26-06-2025 06:21:57 PM

ప్రైవేటు విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ 

 ఏఐఎస్ఎఫ్.జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ

మునుగోడు (విజయక్రాంతి): పుస్తకాలు యూనిఫాంలో అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ(AISF District Secretary Mudigonda Muralikrishna) అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలో కైరాలి ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలను, యూనిఫామ్ పట్టుకోని మండల విద్యాశాఖ అధికారిచే సీజ్ చేయించి మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పుస్తకాలను, యూనిఫామ్ ఇష్టాను రాజ్యంగా అమ్ముతూ విద్యార్థుల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు, యూనిఫామ్,డైరీ అమ్మకూడదు అని ఉన్నప్పటికీ అక్రమంగా అమ్ముతూ విద్యార్థుల దగ్గర దోచుకుంటున్నారని ఆరోపించారు.

ప్రైవేటు విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రైవేటు విద్యాసంస్థలలో బహిరంగంగా పుస్తకాల అమ్ముతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పుస్తకాలు యూనిఫామ్ లు అమ్మడాన్ని నియంత్రించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ మండల గోపగోని ఉదయ్, సాయికృష్ణ,నాగరాజు,రాజు,శంకర్, రాంచరణ్,దశరథ  ఉన్నారు.