09-10-2025 12:22:00 AM
జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
బాన్సువాడ, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.
బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సమావేశమైన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పిచ్చి సుప్రీంకోర్టు సిజెఐ బిఆర్ గవాయ్ పై సనాతన ధర్మం పేరుతో మతోన్మాదులు రెచ్చిపోతున్నారనీ, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత పదవులు,హోదా లో ఉంటే ఓర్వలేకపోతూ ఇలాంటి దూచ్చర్యలకు పాలు పడడం చాలా అవమానకరంఅని వారు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్ ,ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఏజాజ్ బాన్సువాడ ఏఎంసీ మాజీ చైర్మన్ నరసింహులు,
జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, మాల మహానాడు మండల నాయకులు మల్లూరు సాయిలు, రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ లు కొత్త బాద్ సాయిలు,తడ్కోల్ రాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు న్యాల కంటి గంగాధర్, దొన కంటి వినోద్, అంబేద్కర్ సంఘం నాయకులు నక్క విజయ్ కుమార్, బేగరీ డాక్టర్ సాయిలు, పరిమళ, సాయిలు, వాగుమారే మారుతి, ఆర్టీసీ, పోతరాజు సాయిలు, మామిడి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.