calender_icon.png 15 October, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108లో ప్రసవం

15-10-2025 12:00:00 AM

తల్లీ బిడ్డ క్షేమం

ములకలపల్లి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం చింతపేట గ్రామానికి చెందిన రవ్వా మౌనికకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఆశా కార్యకర్త 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఏంటి కళా ధర్, పైలెట్ రాజా బాధితురాలు వద్దకు చేరుకొని అంబులెన్స్ లోనికి ఎక్కించి వైద్య పరీక్షలు నిర్వహించి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ అవ డంతో అంబులెన్స్ పక్కన నిలిపి అంబులెన్స్ లోనే కాన్పు చేయడం జరిగింది.

రవ్వా మౌనిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈఎంటి కళాధర్,పైలెట్ రాజా తెలియజేశారు. తల్లి బిడ్డని  మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.108 సిబ్బందిని మౌనిక కుటుంబ సభ్యులు అభినందించారు.