calender_icon.png 15 October, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు

15-10-2025 12:00:00 AM

 కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, ఆక్టోబర్ 14 (విజయక్రాంతి): సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతం తరుణీ హాట్ వద్ద నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాల నిర్మాణ మ్యాప్ లను పరిశీలించి, ఆర్ అండ్ బీ అధికారులు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ  ఖమ్మం రూరల్ మండల స్థాయిలో ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలు ఒకే చోట అన్ని వసతులతో ఉండే విధంగా నిర్మించాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు, భవనాలు, కావాల్సిన వసతుల నమూనా తయారు చేయాలని అన్నారు.

మండల స్థాయిలో తహసిల్దార్, ఎంపిడిఓ, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ మొదలగు అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయం ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. మండల కార్యాలయం నిర్మించిన తర్వాత నిర్వహణ కూడా సక్రమంగా జరిగేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.   కార్యాలయాల్లో ఫైల్స్ పెట్టెందుకు స్టోరేజ్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్&బీ డిఇ భగవాన్, ఏఇ కోటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.