15-10-2025 03:18:22 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి దాన్య బిగించాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు అధైర్య పడవద్దు అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం పరిధిలో మాలిపురం గ్రామంలో బుధవారం మెప్మా వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన అత్యధిక వరి ధాన్యాన్ని ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దే నని అన్నారు. రైతులు పండించిన పంటను ఒక్క క్వింటకు 2389 రూపాయల చొప్పున ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తూది. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని తెలియజేశారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలని అధికారులు తక్షణమే కృషి చేయాలని లేని ఎడల కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.