15-10-2025 02:57:04 PM
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్
బాన్సువాడ,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 16 వ వార్డ్ లో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహనిర్మాణం పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు జట్ల స్వప్న రాజేష్ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేపట్టి ముగ్గు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా నార్ల సురేష్ మాట్లాడుతూ... వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ల కృషితో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇందిర ఇండ్లు నిర్మించుకోవాలని నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి తక్షణమే బిల్లులు చెల్లించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నార్ల ఉదయ్, ఉప్పరి లింగం, కాపర్తి సంగమేష్, వార్డు ప్రత్యేక అధికారి కృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు.